తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఏప్రిల్ పూల్ తరహా జోక్ అయితే బాగుండేదని మంత్రి కేటీఆర్ అన్నారు. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 250 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,253కు చేరింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రాగా.. దీనిపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు.
మరో ట్వీట్‌లో.. ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఎన్టీయే ప్రభుత్వం అచ్చెదిన్ జరుపుకోవాలని వేసిన ఒక కార్టూన్ కి పై స్పందించారు. అచ్చే దిన్ దివస్ ను ఏప్రిల్ పూల్స్ డే పోలుసూ ఆ కార్టూన్ ను రీ ట్వీట్ చేశారు.
ఇక తాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వాస్తవాలు వివరిస్తూనే ఉంటానని.. తన పోస్టింగ్స్ వల్ల ఇబ్బంది పడే వారు ట్విటర్‌లో తనను అనుసరించవద్దని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తాను మాత్రం ఎప్పుడూ మతోన్మాదాన్ని, తప్పుడు ప్రచారాలను ఎప్పుడూ ప్రజల ముందుకి తెస్తానన్నారు.