నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ అధికారులపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో చెప్పాలని అధికారులను నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించకుంటే మనమంతా ఉన్నదెందుకన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ 5వ స్నాతకోత్సవానికి శనివారం మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆర్జీయూకేటీ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తరుచుగా పుడ్ ఫాయిజన్ జరుగుతున్నా మెస్ కాంట్రాక్టర్‌ను ఇంకా ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారని, ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోండని ట్రిపుల్ ఐటీ అధికారులకు సూచించారు.
అనంతరం హాస్టల్ బిల్డింగ్‌పై సోలార్ ప్లాంటును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫాంలు అందజేశారు. ట్రిపుల్ ఐటీలోని చెరువు సుందరీకరణ చేపిస్తామని హామీ ఇచ్చారు.