ఎన్నికల నోటిఫికేషన్‌పై కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, జమిలి ఎన్నికల గురించి మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారని వార్తలు వచ్చాయి.

By Srikanth Gundamalla
Published on : 12 Sept 2023 8:00 PM IST

Minister KTR,  Assembly elections, telangana,

ఎన్నికల నోటిఫికేషన్‌పై కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, జమిలి ఎన్నికల గురించి మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారని వార్తలు వచ్చాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి..? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని చర్చ జరుగుతుండగా.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్‌ 10 వరకు వచ్చే అవకాశం కనిపించడం లేదని.. ఎన్నికలు ఆరు నెలల తర్వాతే జరిగే అవకాశం ఉందని కేటీఆర్‌ చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే.. ఎన్నికలకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తోంది. ఈ మేరకు కేటీఆర్‌ న్యూస్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) పేజ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ.. తెలంగాణ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయని రాసుకొచ్చారు. అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదని.. దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయొద్దని ట్వీట్ చేశారు. దీనిని సవరించుకోవాలని కేటీఆర్ న్యూస్‌ ట్విట్టర్‌ అకౌంట్లో రాసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే కేటీఆర్ ఎన్నికలు ఇప్పుడు జరగవేమో అని అభిప్రాయం వ్యక్తం చేసింది అవాస్తవమని అర్థం అవుతోంది.

Next Story