కేంద్ర‌మంత్రికి హ‌రీశ్‌రావు లేఖ‌.. 3 నెల‌ల వ్య‌వ‌ధిని త‌గ్గించాలని విజ్ఞ‌ప్తి

Minister Harish Rao letter to Central Minister Mansukh Mandaviya.క‌రోనా టీకా రెండో డోసు, బూస్ట‌ర్ డోసు(ప్రికాష‌న్‌)

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 Jan 2022 11:40 AM IST

కేంద్ర‌మంత్రికి హ‌రీశ్‌రావు లేఖ‌.. 3 నెల‌ల వ్య‌వ‌ధిని త‌గ్గించాలని విజ్ఞ‌ప్తి

క‌రోనా టీకా రెండో డోసు, బూస్ట‌ర్ డోసు(ప్రికాష‌న్‌) మ‌ధ్య ఉన్న వ్య‌వ‌ధిని త‌గ్గించాల‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయాకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. ప్ర‌స్తుతం రెండో డోసు, బూస్ట‌ర్ డోసుకు మ‌ధ్య 9 నెల‌ల గ‌డువు ఉండ‌గా.. దాన్ని ఆరు నెల‌ల‌కు త‌గ్గించాల‌ని ఆ లేఖ‌లో మంత్రి హ‌రీశ్‌రావు కోరారు. హెల్‌కేర్ వ‌ర్క‌ర్ల‌కు రెండో డోసు, బూస్ట‌ర్ డోసుకు మ‌ధ్య గ‌డువును 3 నెల‌లు త‌గ్గించే అవ‌కాశాన్ని ప‌రిశీలించాని విజ్ఞ‌ప్తి చేశారు.

60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్‌తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్క‌రికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ఈ ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచుతున్న‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు ఆ లేఖ‌లో తెలిపారు.

Next Story