క‌రోనా కేసుల నేఫ‌థ్యంలో రేపు అత్యవసర సమావేశం

Minister Etela Rajender meeting -Health Department. స‌మావేశంలో కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, నోడల్ ఆఫీసర్స్ తో సమావేశం కానున్నారు మంత్రి.

By Medi Samrat  Published on  31 March 2021 6:27 AM GMT
Minister Etela Rajender Held Urgent meeting

కరోనా కేసుల పెరుగుదల, చికిత్సపై మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. ఈ మేర‌కు మంత్రి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు. కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో రేపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స‌మావేశంలో కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, నోడల్ ఆఫీసర్స్ తో సమావేశం కానున్నారు మంత్రి.

అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనూ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను, ఆసుపత్రి బాధ్యులను అప్రమత్తం చేసిన మంత్రి, మన దగ్గర కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచడంతోపాటు.. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా తీవ్రత తక్కువగా ఉంది అని అధికారులు మంత్రికి వివరించారు.

కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో విస్తృతమైన ఏర్పాట్లు చేయడం వల్ల డెత్ రేట్ ను గణనీయంగా తగ్గించగలిగామని మంత్రి అన్నారు. మళ్లీ ఇప్పుడు కేసులు పెరిగినా కూడా సమర్థవంతంగా చికిత్స అందిచగలమని మంత్రి అన్నారు. వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుందని, అయితే అందరికీ వాక్సిన్ అందించడానికి అవసరం అయిన డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరామని తెలిపారు.

పోలీస్, మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ ల సమన్వయంతో ప్రణాళికా చేస్తామని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మాస్క్ తప్పని సరిగా ధరించాలని కోరారు, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని కోరారు.


Next Story