అత్యవసర సమయాల్లో రోగి ప్రాణాన్ని కాపాడే సెలైన్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ ను కారు తుడిచేందుకు వాడడం కలకల రేపింది. ఓ ప్రభుత్వాసుపత్రికి చెందిన వైద్యుడు తన కారుపై పడిన పెయింట్‌ను సెలెన్ తో తుడిపిస్తుండగా.. కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి రంగులు వేస్తున్నారు. అక్కడే డాక్టర్ కారు నిలిపి ఉంచగా దానిపై సున్నం పడింది. దాన్ని తుడిచేందుకు సిబ్బంది ఏకంగా సెలైన్ వాడారు. ఇదేందటని ప్రశ్నించగా.. సెలైన్ బాటిల్ లో నీరు పోసి తుడుస్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు.
అయితే.. సెలైన్ బాటిల్ లో నీళ్లు నింపే అవకాశాలు తక్కువని.. కావాలనే ఔషధాలను దుర్వినియోగం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించకపోగా ప్రతి చిన్న రోగానికి వరంగల్ ఎంజీఎంకు రిఫరీ చేస్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.