మేడ్చల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

By Srikanth Gundamalla  Published on  17 July 2023 4:59 AM GMT
Medchal, Road Accident, Three Dead,

మేడ్చల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు దుర్మరణం

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. షామీర్‌పేట్‌ కీసర ఔటర్‌ రింగ్‌రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మితిమీరిన వేగం ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. పోలీసులు, అధికారులు స్పీడ్‌ థ్రిల్స్‌... బట్‌ ఇట్ కిల్స్‌ అంటూ ఎన్నిప్రచారాలు చేసినా ఫలితం లేదు. రోజూ ఏదోచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. ఇంకొందరు తీవ్రగాయాల పాలై జీవితాంతం ఇబ్బందులు పడుతున్నారు. షామీర్‌పేట్‌ కీసర రింగ్‌రోడ్డు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ, బొలేరో వాహనం, మరో కారు మూడు వాహనాలు అత్యంత వేగంగా వచ్చాయి. ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో కారు, లారీ, బొలేరో వాహనాల ముందు భాగాలు మొత్తం నుజ్జునుజ్జు అయ్యాయి. మూడు వాహనాలు ఢీకొనడటంతో అక్కడంతా భయానక వాతావరణం కనిపించింది. రోడ్డు ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ నుండి కీసర వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ పై నుండి ఎగిరి ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో కారు కూడా వేగంగా రావడంతో మూడు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ముగ్గురు వ్యక్తులు అక్కడికకడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Next Story