మేడారం మినీ జాత‌ర తేదీలు ఖ‌రారు

Medaram Sammakka Saralamma Chinna jatara dates announced.తెలంగాణ‌లో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌బోయే మేడారం చిన్న జాత‌ర తేదీలు ఖ‌రారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2021 2:22 PM GMT
Medaram jatara

తెలంగాణ‌లో ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌బోయే మేడారం చిన్న జాత‌ర(మండ మెలిగే పండ‌గ‌) తేదీల‌ను ఆల‌య పూజారులు ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 27వ తేదీ వరకు చిన్న జాత‌ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. మండమేలిగే పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. పూజరుల సంప్రదాయం ప్ర‌కారం ఈ ఏడాది మండమేలిగే పండగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ పూజారులు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నాలుగు రోజుల పాటు జ‌రిగే జాత‌ర‌లో భాగంగా నిత్యం జ‌రిగే కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

-24న (బుధవారం) స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ అమ్మ‌వార్ల ఆల‌యాన్ని శుద్ధి చేయ‌డంతో పాటు గ్రామ ద్వార స్తంభాల‌ను స్థాపించ‌నున్నారు.

-25న (గురువారం) అమ్మ‌వార్ల‌కు ప‌సుపు, కుంకుమ‌తో అర్చ‌న చేయ‌నున్నారు.

-26న‌(శుక్ర‌వారం) భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చున‌ని తెలిపారు.

-27న (శనివారం) అమ్మవార్ల పూజ కార్యక్రమాలు ముగింపుతో మినీ జాతర ముగుస్తుంది.


Next Story
Share it