పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క

Maoist leader Sharadakka surrendered to police.ఇటీవ‌ల కాలంలో మావోయిస్టుల‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 17 Sept 2021 5:05 AM

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత  శారదక్క

ఇటీవ‌ల కాలంలో మావోయిస్టుల‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజ‌గా మావోయిస్టు నేత బజ్జర స‌మ్మ‌క్క అలియాస్ శార‌ద‌క్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. గ‌త‌కొంత‌కాలంలో అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె.. శుక్ర‌వారం ఉద‌యం డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. శార‌ద‌క్క స్వ‌స్థ‌లం మహబూబాద్‌ జిల్లాలోని గంగారం. 1994లో పీపుల్స్ వార్ పార్టీకి ఆక‌ర్షితురాలైన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లారు. గ‌తంలో చ‌ర్ల‌-శ‌బ‌రి ఏరియా క‌మిటీ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన శార‌ద‌క్క‌.. ప్ర‌స్తుతం జిల్లా క‌మిటీ స‌భ్యురాలిగా ప‌నిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 21న శారదక్క భర్త అయిన మావోయిస్టు నేత హరిభూషణ్ కరోనాతో చనిపోయారు. ఇక శార‌ద‌క్క లొంగుబాటుకు సంబంధించిన వివ‌రాల‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మ‌ధ్యాహ్నాం మీడియాకు వెల్ల‌డించ‌నున్నారు.

Next Story