బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పోలీసుల నోటీసులు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 1:57 PM IST
mancherial, police, notice,  brs, balka suman,

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పోలీసుల నోటీసులు 

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బాల్క సుమన్‌పై కాంగ్రెస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే బాల్క సుమన్‌కు తాజాగా నోటీసులు అందజేశారు. నోటీసులను అందుకున్న బాల్క సుమన్‌ వాటిపై సంతకాలు చేశారు. విచారణకు ఎప్పుడు రావాలన్న వస్తానని చెప్పారు.

ఇక పోలీసులు నోటీసులు ఇచ్చిన తర్వాత మాట్లాడిన బాల్క సుమన్.. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్రమంగా తనపై కేసు నమోదు చేయించిందని ఆరోపించారు. మంచిర్యాల ఎస్‌ఐ తనకు నోటీసులు అందించారనీ చెప్పారు. ఉద్యమలో ఎన్నో కేసులను ఎదుర్కొన్నట్లు చెప్పారు బాల్క సుమన్. కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీలో ఉన్నాననీ ఎప్పారు. కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు.

కాగా.. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురించి బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్‌రెడ్డి తన చెప్పును చూపిస్తూ కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో బాల్క సుమన్‌పై తీవ్ర స్తాయిలో కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశార. ఇందులో భాగంగానే మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి బాల్క సుమన్‌కు నోటీసులు ఇచ్చారు.


Next Story