విషాదం.. కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా చేర్యాలలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 March 2024 4:35 PM ISTవిషాదం.. కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా చేర్యాలలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తండ్రి వద్ద కారు కొనివ్వాలని అడిగాడు. అయితే.. తండ్రి ఆర్థిక సమస్యల కారణంగా కారు కొనివ్వలేకపోయాడు. దాంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో.. ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. చేర్యాలకు చెందిన బుట్టి నర్సింహులు అనే వ్యక్తికి 26 ఏళ్ల నవీన్ అనే కుమారుడు ఉన్నాడు. అతను బయటి వ్యక్తుల వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నవీన్ సొంతంగా కారు కొనాలని అనుకున్నాడు. ఇతరుల వద్ద పనిచేయడం వల్ల డబ్బులు మిగలడం లేదని భావించి.. తన తండ్రి ని కారు కొనివ్వాలని అడిగాడు. అయితే.. తండ్రి కూడా కొడుకు ఆలోచన సరైనదే అని అనుకున్నాడు. కారు కొనిచ్చేందుకు ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కొందామని కొడుకుకి సర్దిచెప్పాడు.
కానీ.. కుమారుడు టెంపరరీ డ్రైవర్‌గా వెళ్లను అని, కారు కొనిస్తేనే ఓనర్ కం డ్రైవర్‌గా పనిచేసుకుంటానని తెగేసి చెప్పాడు నవీన్. గత 15 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక చూసీచూసీ కొడుకుని నవీన్‌ను తన తండ్రి నిలదీశాడు. ఇంకెన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉంటావ్ అని. దాంతో.. మనస్తాపానికి గురైన నవీన్ సోమవారం చేర్యాల పట్టణ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు.