తన చావుకి సీఐ, ఎస్సై కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్.. అదృశ్యం

తన చావుకి సీఐ, ఎస్‌ఐ కారణమంటూ ఓ వ్యక్తి సూసైడ్‌ నోట్ రాశాడు.

By Srikanth Gundamalla  Published on  1 May 2024 2:45 PM IST
man missing,   sucide letter, hanamkonda,

 తన చావుకి సీఐ, ఎస్సై కారణమంటూ వ్యక్తి సూసైడ్ నోట్.. అదృశ్యం

తన చావుకి సీఐ, ఎస్‌ఐ కారణమంటూ ఓ వ్యక్తి సూసైడ్‌ నోట్ రాశాడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. హన్మకొండ జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు తన భర్త సూసూడ్‌ రాసి.. అదృశ్యం కావడంతో మాధవి సీపీని ఆశ్రయించింది. తన భర్తను వెతికిపెట్టాలనీ.. అలాగే తన భర్తను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

హన్మకొండ జిల్లాలో శ్యామల ప్రశాంత్‌ కుమార్, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే.. ప్రశాంత్‌ కుమార్ వంగపాటి గ్రామంలో ఉన్న ఓ వ్యక్తికి కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. వాటిని తిరిగి ఇవ్వాలని ప్రశాంత్ కుమార్‌ కోరగా.. అతను ఇవ్వలేదు. పైగా డబ్బులు మరోసారి అడిగితే చంపేస్తానంటూ బెదిరించాడట. దాంతో.. భయాందోళనకు గురైన ప్రశాంత్‌ డయల్‌ 100కి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు కూడా అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత ప్రశాంత్‌ కుమార్ హసన్‌పర్తి సీఐ, ఎస్‌ఐలను కలిశాడు. తనకు జరిగిన విషయాన్నంతా చెప్పాడు. హసన్‌పర్తి ఎస్‌ఐ, సీఐ .. ప్రశాంత్‌కు రావాల్సిన డబ్బులను తిరిగి ఇప్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే పోలీస్‌ స్టేషన్‌లో అన్యాయంగా తన భర్తను పోలీసులు చితకబాదారని భార్య మాధవి వాపోయింది. పోలీసుల దెబ్బలు భరించలేకే భర్త ప్రశాంత్‌ కుమార్ సూసైడ్ నోటీ రాశాడని చెప్పింది.

ఇప్పుడు అదృశ్యం అయ్యాడనీ.. తన భర్తను వెతికి పెట్టాలని మాధవి పోలీసు ఉన్నతాధికారులను కోరుతోంది. హసన్‌పర్తి సీఐ, ఎస్‌ఐ వల్లే తన భర్త ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని వాపోయింది. తన భర్త ప్రశాంత్‌ కుమార్‌కు ఏదైనా జరిగితే అది హనస్‌పర్తి సీఐ, ఎస్‌ఐ మీదకే వస్తుందనీ.. వారే బాధ్యులంటూ పేర్కొంది మాధవి. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే వారే తిరిగి కొట్టడం దారుణమని చెప్పారు. హనస్‌పర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాధవి సీపీకి కంప్లైంట్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు.


Next Story