ఐదేళ్ల ప్రేమ‌.. ట్రాన్స్‌జెంట‌ర్‌ను పెళ్లి చేసుకున్న జ‌గిత్యాల యువ‌కుడు

Man marries transgender in Jagtial. ఓ యువ‌కుడు ట్రాన్స్ జెండ‌ర్‌ను పెళ్లి చేసుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2022 9:52 AM IST
ఐదేళ్ల ప్రేమ‌.. ట్రాన్స్‌జెంట‌ర్‌ను పెళ్లి చేసుకున్న జ‌గిత్యాల యువ‌కుడు

ఒక‌ప్పుడు పెళ్లంటే అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య జ‌రిగేది. ఇటీవ‌ల కాలంలో విచిత్ర వివాహాల సంఖ్య పెరుగుతోంది. అమ్మాయి-అమ్మాయి, అబ్బాయి-అబ్బాయి లు పెళ్లి చేసుకుంటుండాన్ని చూస్తున్నాం. తాజాగా ఓ యువ‌కుడు ట్రాన్స్ జెండ‌ర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట‌లో చోటు చేసుకుంది.

వీణవంకకు చెందిన ట్రాన్స్‌జెండర్ సంపత్ ఇంట్లోంచి వెళ్లిపోయాడు. చాలా ఏళ్ల పాటు ఎక్క‌డెక్క‌డో తిరిగాడు. అనంత‌రం జ‌గిత్యాల‌కు చేరుకున్నాడు. ఐదేళ్ల క్రితం కారు డ్రైవ‌ర్ గా ప‌ని చేసే అర్ష‌ద్ అనే యువ‌కుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం మ‌రింత పెర‌గ‌డంతో పెళ్లి చేసుకుందామ‌ని అర్ష‌ద్ ప్ర‌తిపాదించాడు. అయితే.. సంప‌త్ అందుకు నిరాక‌రించాడు. ఐదు సంవ‌త్స‌రాలు అయినా అత‌డి ప్రేమ త‌గ్గ‌లేదు.

దీంతో చ‌లించిపోయిన సంప‌త్ ఇటీవ‌ల లింగ‌మార్పిడి శ‌స్త్ర‌చికిత్స చేయించుకుని దివ్య‌గా పేరు మార్చుకున్నాడు. శుక్ర‌వారం వీరిద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. అనంత‌రం ఇల్లంద‌కుంట రామాల‌యంలో పూజ‌లు చేశారు. వీరి పెళ్లి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.

Next Story