చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం నాడు సురేందర్ అనే వ్యక్తి నిన్న ఇంట్లో చికెన్ తింటుండగా ఓ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతడికి ఊపిరి ఆడలేదు. ఈ క్రమంలోనే అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు రుచిత, శిరీష ఉన్నారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదం నింపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లిలోని కేసీఆర్ డబుల్‌బెడ్రూం కాలనీకి చెందిన పాటి సురేందర్(45) ట్రాలీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం నాడు భోజనం చేస్తుండగా చికెన్ ముక్క గొంతులో తట్టుకుంది. దానిని తీసే క్రమంలోనే ఊపిరి ఆడకపోవడంతో మృతిచెందాడు. ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గొంతులో గుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.