ఫోన్ మాట్లాడుతూ పరధ్యానం..చంకలో హీటర్ పెట్టుకోవడంతో వ్యక్తి మృతి
ఫోన్ పరధ్యానంలో పడి హీటర్‌ను మర్చిపోయి తన చంకలోనే పెట్టుకున్నాడు. దాంతో.. విద్యుత్ షాక్ తో స్పాట్‌లోనే చనిపోయాడు.
By Srikanth Gundamalla Published on 12 Aug 2024 11:30 AM ISTఫోన్ మాట్లాడుతూ పరధ్యానం..చంకలో హీటర్ పెట్టుకోవడంతో వ్యక్తి మృతి
అందరిదీ బిజీ లైఫ్ అయిపోయింది. ఒక్కోసారి సమయం సరిపోక ఒకేసారి రెండు పనులు చేసేందుకు ప్రయత్నిస్తుంటాం. ఈ క్రమంలోనే చిక్కుల్లో పడుతుంటారు. ముఖ్యంగా చాలా మంది ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.. తినడం సహా చిన్న చిన్న పనులు చేస్తుంటారు. ఇలాంటి వారికి తాజాగా జరిగిన ఓ సంఘటన హెచ్చరికనే చెప్పాలి. ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ వాటర్ హీటర్ ఆన్ చేయాలని చేశాడు. అయితే.. ఫోన్ పరధ్యానంలో పడి హీటర్‌ను మర్చిపోయి తన చంకలోనే పెట్టుకున్నాడు. దాంతో.. ఆ వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలింది. స్పాట్‌లోనే చనిపోయాడు.
ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేష్ బాబు (40) నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కొబ్బరికాయల వ్యాపారం చేసుకునేవాడు. అయితే.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తన పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలోనే వేడి నీళ్లు పెట్టడానికి ఎలక్ట్రిక్ హీటర్ ఆన్ చేయాలనుకున్నాడు. ఈలోగా అతి ఫోన్ కాల్ వచ్చింది. ఇక అక్కడికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ వచ్చాడు. అలా ఫోన్ మాట్లాడే ధ్యాసలో నిర్లక్ష్యంగా వాటర్ హీటర్‌ను నీటి బకెట్‌లో బదులు తన చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశాడు. అంతే ఒక్కసారిగా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు.
మహేశ్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో గమినంచిన కుటుంబ సభ్యులు భయడిపోయారు. వెంటనే కేకలు వేశారు. ఆ తర్వాత అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. కాగా.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నామనీ.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అనుకోకుండా మహేశ్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.