Mancherial: పోలీస్ స్టేషన్‌లో ఫిట్స్ వచ్చి వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడు కూర్చున్న చోటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 12:42 PM ISTMancherial: పోలీస్ స్టేషన్‌లో ఫిట్స్ వచ్చి వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడు కూర్చున్న చోటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన చూసిన పోలీసులు షాక్ అయ్యారు.
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఇంటిపై దాడి కేసులో విచారణ చేస్తున్నారు పోలీసులు .అందులో భాగంగానే అంజి అనే యువకుడిని కూడా విచారణకు పిలిచారు. అయితే.. విచారణ జరుగుతున్న సమయంలో అంజి పోలీస్‌స్టేషన్‌లో కుర్చీలో కూర్చున్నాడు. సెల్‌ఫోన్ చూస్తూ ఉన్నాడు. అంతా నార్మల్‌గానే ఉంది. కానీ.. ఉన్నట్లుండి అంజి గిలాగిలా కొట్టుకోవడం ప్రారంభించాడు. సెల్‌ఫోన్ కిందపడిపోయింది. దాంతో.. అక్కడే బయటే తిరుగుతున్న పోలీసు.. అంజిని గమనించాడు. దగ్గరకి వచ్చి చూశాడు. అతనికి ఫిట్స్ వచ్చిందనే అనుమానంతో లోనికి వెళ్లి ఇతర పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత వెంటనే అంజిని ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. యువకుడిని పరిశీలించిన వైద్యులు.. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఫిట్స్ వచ్చిన సమయంలోనే అతడికి గుండెపోటు వచ్చిందని.. అందుకే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. అంజి మృతి చెందిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు పోలీసులు. దాంతో.. విచారణ కోసం పోలీస్‌స్టేషన్ కు వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా.. అంజికి ఫిట్స్ వచ్చిన దృశ్యాలు పోలీస్‌స్టేషన్‌లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోందని.. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక వైద్య నిపుణులు కూడా ఆరోగ్యం పట్ల పెద్దవారే కాదు.. యువత కూడా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు.
బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిట్స్ వచ్చి నిందితుడు మృతిమంచిర్యాల - బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు.ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి… pic.twitter.com/xV9RCXBZ3c
— Telugu Scribe (@TeluguScribe) August 28, 2023