బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య ప్రయత్నం

Man arrested for armoor mla jeevan reddy murder plan. టీఆర్‌ఎస్‌ నేత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యకు కుట్ర పనిన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌

By అంజి  Published on  2 Aug 2022 9:55 AM IST
బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య ప్రయత్నం

టీఆర్‌ఎస్‌ నేత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యకు కుట్ర పనిన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని వేమూరీ ఎన్‌క్లేవ్‌లోని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జీవన్‌రెడ్డిపై ఆర్మూర్‌ నియోజకవర్గం మక్లూర్‌ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త హత్య యత్నానికి ప్రయత్నించాడు. తన భార్య లావణ్యను సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ చేయడంతో ఎమ్మెల్యేపై సర్పంచ్ భర్త ప్రసాద్‌ గౌడ్‌ కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర మంగళవారం ఉదయం ప్రసాద్‌ గౌడ్‌ అనుమానాస్పదంగా తిరిగాడు.

ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ఇంటి వద్ద ప్రసాద్‌ గౌడ్‌ అనుమానాస్పదంగా తిరగడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు.. అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక కత్తి, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సర్పంచ్ భర్తను విచారిస్తున్నారు. తుపాకీ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటన టీఆర్‌ఎస్‌ నేతల్లో అలజడి రేపింది.

Next Story