తెలంగాణలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్ డౌన్‌ను 30 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నందున 20న జరగాల్సిన కేబినెట్ భేటీని సీఎం కేసీఆర్ రద్దు చేశారు.
ఇదిలావుంటే.. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేఫథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 12 నుంచి పదిరోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. ఈ పదిరోజుల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రం లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంది. ఈ సమయంలో నిత్యవసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.