చెరకు తోటలో చిరుతపులి పిల్ల లభ్యం

Leopard Babys Found In Sugarcan Feild. మెదక్​ జిల్లా హవేళీ ఘనపూర్​ మండలం సుల్తాన్​పూర్​లోని చెరకు తోటలో

By Medi Samrat  Published on  24 Nov 2020 12:39 PM GMT
చెరకు తోటలో చిరుతపులి పిల్ల లభ్యం

మెదక్​ జిల్లా హవేళీ ఘనపూర్​ మండలం సుల్తాన్​పూర్​లోని చెరకు తోటలో సోమవారం చిరుతపులి పిల్ల కనిపించింది. ఈ విషయమై సంబంధిత తోట యజమాని, గ్రామస్తలు ఫారెస్టు శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు హుటాహుటిన వెళ్ళి వాటిని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి శ్రీనివాస్​ నాయక్​ మాట్లాడుతూ... సుల్తాన్​పూర్​తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గొర్రెల కాపరులు పది రోజుల వరకు అడవిలోకి వెళ్ళరాదని సూచించారు. ఈ విషయం తెలిసిన ఆయా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


Next Story