Telangana: సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన కుమారి ఆంటీ

వరద బాధితులకు సాయం అందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయన నిధికి రూ.50వేలు విరాళం ఇచ్చారు కుమారి ఆంటీ.

By Srikanth Gundamalla  Published on  18 Sept 2024 5:44 PM IST
Telangana: సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన కుమారి ఆంటీ

వరద బాధితులకు సాయం అందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయన నిధికి రూ.50వేలు విరాళం ఇచ్చారు కుమారి ఆంటీ. సీఎం రేవంత్‌రెడ్డికి చెక్కు అందజేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దాంతో.. రెండు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాలు వరదుల సంభవించాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడు.. తెలంగాణలోని ఖమ్మంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. చాలా మంది ఇళ్లు వరద నీటిలో ధ్వంసం అయ్యాయి. నిరాశ్రయులు అయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు సహాయం ప్రకటించారు. ఇటీవల తెలంగాణ సీఎంను కలిసి పలువురు సినీ ప్రముఖులు చెక్కులు కూడా అందజేశారు.

అయితే.. కొంతకాలం ముందు ఫుడ్‌ బిజినెస్‌తో సోషల్‌ మీడియాలో తెగ పాపులర్ అయ్యింది కుమారి ఆంటీ. ఆమె వద్ద భోజనం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు. కుమారి ఆంటీ కూడా తన మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్‌లో ఫుడ్‌ బిజినెస్ చేస్తూ వచ్చిన డబ్బులను వరద బాధితుల సహాయం కోసం విరాళం ఇచ్చారు. రూ.50వేల రూపాయలను సీఎం సహాయనిధికి ఇచ్చారు. ఈ మేరకు బుధవారం సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన కుమారీ ఆంటీ.. రూ.50వేల చెక్కును తన కూతురుతో కలిసి అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆమెను అభినందించారు. అలాగే మరికొందరు ప్రముఖులు కూడా విరాళాలు అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌ను కలిసిన టెక్నో పెయింట్స్ డైరెక్టర్స్ ఆకునూరి శ్రీనివాసరెడ్డి, సీవీఎల్ఎన్ మూర్తి, అనిల్ చెక్ అందించారు.

Next Story