వీళ్ళు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు..వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

By -  Knakam Karthik
Published on : 27 Feb 2026 11:02 AM IST

KTR, BRS, CM RevanthReddy, Telangana Politics, Congress, Congress Govt

వీళ్ళు మంత్రులు కాదు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు..వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు పంపుతానని మాట ఇచ్చినందుకే, పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్మి సీఎం నిధులు సిద్ధం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఒకవైపు పేదల ఇళ్లను పెకిలిస్తూ, మరోవైపు హైదరాబాద్‌లో సీఎం తన రెండో ప్యాలెస్‌ను నిర్మించుకుంటున్నారని, కేవలం గోడలకే తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మూడో ఇల్లు కట్టుకుంటుంటే, మంత్రి పొంగులేటి పదో కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వం కాదు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అని.. వీళ్ళు మంత్రులు కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లని కేటీఆర్ విమర్శించారు.

Next Story