కంటోన్మెంట్‌ విలీనంపై మీరేమంటారు మంత్రి కేటీఆర్ ట్వీట్‌

KTR tweet on Secunderabad cantonment merge in GHMC.సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Sep 2021 7:58 AM GMT
కంటోన్మెంట్‌ విలీనంపై మీరేమంటారు మంత్రి కేటీఆర్ ట్వీట్‌

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ)లో విలీనంపై మంత్రి కేటీఆర్ ప్ర‌జాభిప్రాయాన్ని కోరారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్‌ బోర్డును విలీనం చేయాలన్న అభిప్రాయానికి తాను అంగీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలంటూ మంత్రి ట్వీట్‌ చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని చాలా మంది కోరుతున్నారు. విలీనం చేయాలనే వాదనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. మరి మీరేమంటారు?' అని ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ ప్రజల అభిప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఎప్పటి నుంచో కంటోన్మెంట్‌ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఉంది.

Next Story
Share it