సింగరేణి గనిలో ప్రమాదం.. పైక‌ప్పు కూలి ఇద్ద‌రు కార్మికులు మృతి

Accident at Singareni mine.సింగరేణి కేటీకే 6వ గనిలో కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గనిపైకప్పు కూలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 8:02 PM IST
mine

తెలంగాణ‌లోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా సింగ‌రేణి ప్ర‌మాదం సంభ‌వించింది. సింగరేణి కేటీకే 6వ గనిలో కార్మికులు పని చేస్తుండగా ప్రమాదవశాత్తు గనిపైకప్పు కూలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న సింగ‌రేణి రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతి చెందిన కార్మికుల‌ను శంక‌ర‌య్య‌. న‌ర్స‌య్య‌గా గుర్తించారు. కార్మికులు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పై క‌ప్పు ఎలా కూలింది అన్న దానిపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.


Next Story