నేడు త‌మిళ‌నాడుకు సీఎం కేసీఆర్‌.. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌.. స్టాలిన్‌తో కీలక భేటీ

KCR will visit Ranganatha Swamy in Srirangam on Monday.సీఎం కేసీఆర్ కుటుంబ స‌మేతంగా నేడు త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Dec 2021 9:03 AM IST
నేడు త‌మిళ‌నాడుకు సీఎం కేసీఆర్‌.. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌.. స్టాలిన్‌తో కీలక భేటీ

సీఎం కేసీఆర్ కుటుంబ స‌మేతంగా నేడు త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు వెలుతున్నారు. రెండు రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న కొన‌సాగ‌నుంది. సోమ‌వారం శ్రీరంగంలోని రంగ‌నాథ‌స్వామి వారిని ద‌ర్శించుకోనున్న ఆయ‌న మంగ‌ళ‌వారం త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో భేటి కానున్న‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం ఉద‌యం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తిరుచ్చి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2 గంటలకు రంగనాథస్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు. స్వామివారిని ద‌ర్శించుకున్న అనంత‌రం.. అక్క‌డి నుంచి తిరుచిరాప‌ల్లి విమానాశ్ర‌యానికి చేరుకుని ప్ర‌త్యేక విమానంలో చెన్నైకి ప‌య‌న‌మ‌వుతారు. రాత్రికి అక్క‌డే బ‌స‌చేయ‌నున్నారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ భేటి కానున్నార‌ని తెలుస్తోంది. ఈ భేటిలో ప‌లు రాజ‌కీయ అంశాలు చ‌ర్చించే అవ‌కాశం ఉంది. కేంద్రం రాష్ట్రాల‌పై అనుసరిస్తున్న వైఖరి, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇక యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్ ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రి పునర్ నిర్మాణపనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Next Story