క‌రోనా రోగుల‌కు ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్

KCR Talks with corona patients.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నాం గాంధీ ఆస్ప‌త్రికి చేరుకున్నారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 8:06 AM GMT
KCR

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నాం గాంధీ ఆస్ప‌త్రికి చేరుకున్నారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. ఆయ‌న వెంట మంత్రి హ‌రీష్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. ఆస్ప‌త్రిలో క‌రోనా చికిత్స‌లు, ఇత‌ర స‌దుపాయాల‌ను ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. క‌రోనా ఎమ‌ర్జెన్సీ వార్డును సీఎం సంద‌ర్శించారు. ఎమర్జెన్సీ(ఐసీయూలో) వార్డులో ఉన్న రోగుల‌ను ప‌రామ‌ర్శించి.. రోగుల‌తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్లు, ఇత‌ర సిబ్బందిని సీఎం అభినందించారు.

క‌రోనా చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి చ‌ర్చించ‌నున్నారు. కాగా.. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ద్దే ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ శాఖ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ గాంధీ ఆస్ప‌త్రిని ప‌రిశీలించారు. ఇక సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రోగుల స‌హాయ‌కుల‌ను బ‌య‌ట‌కు పంపించేశారు. గాంధీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ర‌సాయ‌నాల‌తో పిచికారీ చేశారు.


Next Story