బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావు అరెస్ట్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  2 April 2024 2:45 PM IST
kcr,   kanna rao arrest, adibatla police,

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావు అరెస్ట్ 

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. భూకబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అలియాస్‌ తేజేశ్వరరావును ఆదిభట్ల పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అదే సమయంలో కన్నారావు వేసిన ముందు బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దాంతో.. ఆయనకు చుక్కెదురైంది.

రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో రెండు ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారన్న కేసులో కన్నారావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఇప్పటికే 10 మందిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 28 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. అయితే.. అరెస్ట్‌ అయినవారిలో కన్నారావు ప్రధాన అనుచరుడు డానియల్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. భూకబ్జా కేసులో భాగంగా ముందు కన్నారావు కనిపించకపోవడంతో.. అతను సింగపూర్ పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కన్నారావుపై లుకౌట్‌ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కన్నారావుపై 147,148,447,427,307,436,506,r/w149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

అయితే.. అరెస్ట్‌కు ముందే ముందస్తు బెయిల్‌ కోసం కన్నారావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ.. తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. అంతకుముందు కేసు కొట్టివేయాలని కోరుతూ కన్నారావు వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Next Story