టీఎస్‌పీఎస్సీ.. చైర్మన్‌, సభ్యుల నియామకం

KCR appointed the TSPSC chairman and members.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి చైర్మ‌న్ తో పాటు ఏడుగుగురు స‌భ్యుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నియ‌మించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2021 6:17 AM GMT
TSPS Chairman

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి చైర్మ‌న్ తో పాటు ఏడుగుగురు స‌భ్యుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నియ‌మించింది. సీఎం కేసీఆర్ ప్ర‌తిపాద‌న‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌రరాజ‌న్ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా బి.జ‌నార్థ‌న్ రెడ్డి నియ‌మితులు అయ్యారు. ఈయ‌న ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా పనిచేస్తున్నారు.

సభ్యులు వీరే..

విశ్రాంత ఈఎన్సీ ర‌మావ‌త్ ధ‌న్‌సింగ్‌, సీబీఐటీ ప్రొఫెసర్‌ బీ లింగారెడ్డి, స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ కోట్ల అరుణ‌కుమారి, ప్రొఫెస‌ర్ సుమిత్రా ఆనంద్‌ తనోబా, ఆయుర్వేద వైద్యులు డాక్ట‌ర్ అర‌వెల్లి చంద్ర‌శేఖ‌ర్ రావు, టీఎన్జీవో మాజీ అధ్య‌క్షుడు కారం ర‌వీంద్ర‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.స‌త్య‌నారాయ‌ణ‌ల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది.

నాలుగు వారాల్లోపు టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్‌, స‌భ్యుల‌ను నియ‌మించాల‌ని ఇటీవ‌ల తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఛైర్మ‌న్‌, స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. త్వ‌రలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఛైర్మ‌న్‌, స‌భ్యుల‌ను నియ‌మించ‌డంతో.. ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.


Next Story
Share it