సీపీఐ నేత‌ రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Kavitha Visited senior leader D Raja at the hospital. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాను ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం పరామర్శించారు.

By Medi Samrat
Published on : 31 Jan 2021 11:26 AM IST

Kavitha Visited senior leader D Raja at the hospital

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాను ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం పరామర్శించారు. అస్వస్థతకు గురై కోఠీలోని కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయ‌న‌ను.. క‌విత ఆసుప‌త్రికి వ‌ద్ద‌కు వెళ్లి పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోఠీలోని కామినేని హాస్పిటల్‌కు తరలించారు.


ఇదిలావుంటే.. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో సీపీఐ జాతీయ స‌మితీ సమావేశాలు శుక్రవారం ప్రారంభయయ్యాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రాజా నిన్న ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. రాజా వెంట‌ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఉన్నారు.


Next Story