కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి చెందిన అజీజుద్దీన్ ఫైజాన్ కి చెందిన మేకలపై ఈరోజు ఉదయం కుక్కలు దాడి చేసి చంపేసాయి. గతంలో ఇదే యువకుడికి చెందిన మేకలను కోళ్లను కూడా ఇదే విధంగా దాడి చేసి చంపేసాయి. అయితే దీనిపై గతంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేశానని... కోళ్లు మేకలు పెంపకం చేపడుతుంటే ఇలా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడికి పాల్పడి చంపేస్తున్నాయని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా మరోసారి జరిగిన ఈ దాడి పరిణామం పరిణామంతో ఈరోజు ఉదయం కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు యువకుడు నిరసనకు దిగాడు.
ఇప్పటివరకు సుమారు 2 లక్షల రూపాయల విలువైన మేకలను తాను వీధికుక్కల దాడిలో కోల్పోయానని అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నారని అన్నాడు. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించగా ఆయన సైతం యువకుడిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని. కుక్కలు దాడి చేస్తే తమకేం సంబంధం అంటూ నిర్లక్ష్య వైఖరి చూపించడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుట అద్దం పడుతుందోని అన్నాడు.
గతంలో కూడా ఇదే యువకుడు గతంలో జరిగిన దాడిపై జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం అందించారు. అయినప్పటికీ కొత్తపల్లి మున్సిపల్ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకుండా పోయింది. అధికారులు నిర్లక్ష్యం మాట అటు ఉంచితే ఇటు పాలకులు మరింత నిర్లక్ష్యంగా తయారయ్యారని, కనీసం వార్డుల్లో పరిస్థితులు ఇంత దుర్భరంగా ఉంటున్నాయో కూడా పట్టించుకోవడంలేదని కొత్తపల్లి పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లాస్థాయి అధికారులు కొత్తపల్లి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య పరిస్థితిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు పేర్కొన్నారు.