బైక్‌ చక్రంలో చిక్కుకున్న చున్నీ.. పూజిత మృతి

కరీంనగర్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్‌ చక్రంలో చున్నీ ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి మహిళ మృతి చెందింది.

By అంజి
Published on : 20 Sept 2023 7:07 AM

Karimnagar, Woman died, Jammikunta

 బైక్‌ చక్రంలో చిక్కుకున్న చున్నీ.. పూజిత మృతి

కరీంనగర్‌ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బైక్‌ చక్రంలో చున్నీ ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడిన ఓ మహిళ హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం నాగురాంకు చెందిన జగన్‌రావు, పూజిత దంపతులు జ్వరంతో బాధపడుతున్న తమ ఇద్దరు కుమార్తెలు నిత్యశ్రీ, అజిశ్రీనులను సోమవారం బైక్‌పై జమ్మికుంటలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.

మార్గమధ్యంలో ధర్మారం సమీపంలో పూజిత చున్నీ బైక్ వెనుక చక్రానికి ఇరుక్కోవడంతో ఆమె బైక్ పై నుంచి కిందపడి తలకు బలమైన గాయమైంది. జమ్మికుంటలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఆమెను హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచింది. జగన్ రావు ఓవర్ స్పీడ్ వల్లే తన కూతురు చనిపోయిందని పూజిత తల్లి మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story