బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. గుండెపోటుతో కౌన్సిల‌ర్ భ‌ర్త క‌న్నుమూత‌

బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ బండారి ర‌జ‌నీ భ‌ర్త బండారి న‌రేంద‌ర్ గుండెపోటుతో క‌న్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2023 12:42 PM IST
Bandari Narender, Karimnagar

బండారి న‌రేంద‌ర్

జ‌గిత్యాల జిల్లాలోని గాంధీన‌గ‌ర్‌లో భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) పార్టీ నిర్వ‌హించిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ఊహించ‌ని విషాదం చోటు చేసుకుంది. ఆత్మీయ స‌మ్మేళ‌నంలో భాగంగా తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం వ‌ద్ద బీఆర్ఎస్ నాయ‌కులు ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తున్నారు. వారంతా గుండ్రంగా ఉండి నృత్యాలు చేస్తుండ‌గా బీఆర్ఎస్ కౌన్సిల‌ర్ బండారి ర‌జ‌నీ భ‌ర్త బండారి న‌రేంద‌ర్ మ‌ధ్య‌లో ఉండి వారిని ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. ఆయ‌న డ్యాన్స్ చేస్తూ ఉన్న‌ట్లుండి గుండెపోటుతో కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే ప‌క్క‌న ఉన్న బీఆర్ఎస్ నేత‌లు ఆయ‌న్ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు. దీంతో ఆత్మీయ స‌మ్మేళ‌నంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ఎమ్మెల్సీ క‌విత పాల్గొన‌నున్నారు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత రానున్నారు. గాంధీనగర్ నుండి ర్యాలీగా వచ్చి కొత్త బస్టాండ్ దగ్గర వున్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి అనంతరం ఆత్మీయ సమ్మేళనంలో క‌విత పాల్గొనున్నారు. ఈ నేప‌థ్యంలో క‌విత‌కు స్వాగ‌తం చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేత‌లు.

Next Story