తెలంగాణ వ్యాప్తంగా మరోసారి 'కంటి వెలుగు' కార్యక్రమం

Kanti Velugu Will Start From January 18. 2018లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని.. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి

By అంజి  Published on  17 Nov 2022 1:16 PM GMT
తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమం

2018లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని.. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మరోసారి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈరోజు కంటి వెలుగు కార్యక్రమం అమలుకు సంబంధించి సమీక్ష చేపట్టారు. ప్రజారోగ్యంపై వైద్యారోగ్య శాఖ, ఇతర మంత్రులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు.

కంటి వెలుగు పథకాన్ని 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్ లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కూడా వెచ్చించింది. పథకంలో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం కళ్లద్దాలతోపాటు మందులను పంపిణీ చేసింది. అప్పట్లో ఈ కార్యక్రమం విజయవంతమైంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి, పాడైన వాటి మరమ్మతులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు. పనుల నాణ్యతపై సమీక్ష చేశారు. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, రోడ్లు ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా.. బాధ్యతల వికేంద్రీకరణతోపాటుగా పనుల నాణ్యత పెంచే దిశగా రోడ్లు, భవనాలు శాఖలో చేపట్టాల్సిన నియామకాలు, ఇతర అంశాలపై సీఎం చర్చించారు.

Next Story