నాకు ల‌క్ష ఓట్లు వ‌చ్చాయి.. బ్యాలెట్ పేప‌ర్ పెడితే రుజువు చేస్తా : కేఏ పాల్‌

KA Paul comments on Munugode Bypoll votes counting.మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పై కేఏ పాల్ అసహ‌నం వ్య‌క్తం చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 9:13 AM GMT
నాకు ల‌క్ష ఓట్లు వ‌చ్చాయి.. బ్యాలెట్ పేప‌ర్ పెడితే రుజువు చేస్తా : కేఏ పాల్‌

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పై ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ అసహ‌నం వ్య‌క్తం చేశారు. తొమ్మిది రౌండ్లు పూర్తైన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు క‌నీసం ఓట్లు ప‌డ‌లేదు.

తాను ల‌క్ష మెజార్టీతో గెలుస్తాన‌ని పోలింగ్ అనంత‌రం కేఏ పాల్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ.. ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌,బీజేపీ భారీగా అవినీతి పాల్ప‌డ్డాయ‌ని ఆరోపించారు. ల‌క్ష‌కు పైగా ఓట్లు త‌న‌కే వ‌చ్చాయ‌ని బ్యాలెట్ పేప‌ర్ పెడితే ఆ విష‌యాన్ని రుజువు చేసి చూపిస్తాన‌ని అన్నారు.

ఈవీఎంల ప‌నితీరుపై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌న్నారు. 200ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎల‌క్ష‌న్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. అవినీతిపై న్యాయ‌స్థానంలో తేల్చుకుంటాన‌ని చెప్పారు.

ఆధిక్యంతో టీఆర్ఎస్‌

మునుగోడులో టీఆర్ఎస్ దూకుడు కొన‌సాగిస్తోంది. ఎనిమిది రౌండ్లు ముగిసే స‌రికి 3,091 ఓట్ల మెజార్టీతో కొన‌సాగుతోంది. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6624 ఓట్లు పోలవగా, బీజేపీకి 6088 ఓట్లు వచ్చాయి. దీంతో ఎనిమిదో రౌండ్‌లో కారు గుర్తుకు 536 ఓట్లు అధికంగా వచ్చాయి.

ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లు పూర్తి కాగా.. రెండు, మూడు రౌడ్లలో మినహా మిగిన అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు.

Next Story