కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో ముఖ్యమంత్రికి అందజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ , సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ నివేదికను ముఖ్యమంత్రికి అందించారు.
కమిషన్ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేస్తుంది. నీటి పారుదల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర మంత్రిమండలికి సమర్పించనుంది.