Breaking News : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్

తెలంగాణ రాష్ట్ర కొత్త‌ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియ‌మితుల‌య్యారు. జితేంద‌ర్ నియామ‌కానికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేప‌టి క్రితం వెలువ‌డ్డాయి

By Medi Samrat  Published on  10 July 2024 4:51 PM IST
Breaking News : తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్

తెలంగాణ రాష్ట్ర కొత్త‌ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియ‌మితుల‌య్యారు. జితేంద‌ర్ నియామ‌కానికి సంబంధించిన ఉత్తర్వులు కొద్దిసేప‌టి క్రితం వెలువ‌డ్డాయి. ప్రస్తుతం జితేందర్ హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జితేంద‌ర్ డీజీపీగా నియ‌మిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు.

పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన జితేందర్.. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. 2025 సెప్టెంబరులో జితేందర్ పదవీ విరమణ ఉండగా.. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలలపాటు కొనసాగే ఛాన్స్ ఉంటుంది. అవిభ‌క్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న వివిధ హోదాల‌లో ప‌నిచేశారు. ఇక ప్ర‌స్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా నియమిస్తున్న‌ట్లు కూడా సీఎస్ శాంత కుమారి జారీ చేసిన‌ ఉత్త‌ర్వుల‌లో సేర్కొన్నారు.

Next Story