జనగాం జిల్లాలో నకిలీ డాక్టర్‌.. 10 ఏళ్లుగా వేల మందికి వైద్యం.. టెన్త్‌ పాస్‌ కాకుండానే..

Jangaon.. Fake doctor held for ‘treating’ patients. తెలంగాణలోని జనగాం జిల్లాలో వైద్యుడిలా నటిస్తూ రోగులకు వైద్యం చేస్తున్న 40 ఏళ్ల వ్యక్తిని సోమవారం

By అంజి  Published on  22 Nov 2022 9:49 AM IST
జనగాం జిల్లాలో నకిలీ డాక్టర్‌.. 10 ఏళ్లుగా వేల మందికి వైద్యం.. టెన్త్‌ పాస్‌ కాకుండానే..

తెలంగాణలోని జనగాం జిల్లాలో వైద్యుడిలా నటిస్తూ రోగులకు వైద్యం చేస్తున్న 40 ఏళ్ల వ్యక్తిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులతో కూడిన బృందం జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలో ఓ క్లినిక్‌పై దాడి చేసి ఆ వ్యక్తిని పట్టుకున్నామని, అతడు 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడని, ఎలాంటి అధీకృత మెడికల్ సర్టిఫికెట్ లేదని తేలిందని తెలిపారు. ఒకవేళ తన దగ్గరికి వచ్చే రోగుల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటే కమీషన్ ప్రాతిపదికన వరంగల్‌లోని పలు ఆసుపత్రులకు పంపించేవాడు.

దీని గురించి ఇన్ఫర్మేషన్‌ అందడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం క్లీనిక్‌లో తనిఖీలు చేయగా.. నకిలీ డాక్టర్‌ బాగోతం బట్టబయలైంది. నిందితుడు డాక్టర్‌గా నటిస్తూ క్లినిక్‌ని నడుపుతున్నాడని, గత 10 ఏళ్లుగా పైల్స్, ఫిస్టులాకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు ప్రజలకు "చికిత్స" చేస్తున్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు వేల మందికి అతను వైద్యం చేశాడని తేలింది. కలకత్తాకు చెందిన ఆకాష్ కుమార్ విశ్వాస్ పదోతరగతి కూడా పాస్ కాలేదు. కొంతకాలం తన తాత దగ్గర ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు.

పదేళ్లక్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లికి వచ్చి ఓ క్లినిక్ ప్రారంభించాడు. నిందితుడికి వైద్య అర్హత లేదని, అతను క్లినిక్‌ ప్రారంభించకముందు వేర్వేరు వైద్యుల వద్ద సీనియర్ కాంపౌండర్‌గా పనిచేశాడని, ఆ అనుభవం నుండి అతను రోగులకు చికిత్స చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఎన్ని సర్జరీలు చేశాడనే దానిపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టంలోని నిబంధనలతో పాటు భారత శిక్షాస్మృతిలోని చీటింగ్, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story