జన నాట్య మండలి సీనియర్ కళాకారుడు, జన హృదయ గేయ రచయిత జంగు ప్రహ్లాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న ఆయన గురువారం రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. స్థానికులు స్పందించి హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజా కవిగా, జన నాట్య మండలిలో చురుకైన పాత్రతో పాటు తెలంగాణా ఉద్యమంలో తన ఆట, పాటల ద్వారా కీలక భూమికను పోషించారు జంగు ప్రహ్లాద్. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంకు చెందిన ఆయనకు ముగ్గురు సంతానం