దేశంలోనే ఉత్తమ పోలీసు స్టేషన్లలో 'జమ్మికుంట పోలీసు స్టేషన్‌'

Jammikunta police station among indias top 10 police stations .. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించిన అత్యుత్తమ పోలీసు

By సుభాష్  Published on  3 Dec 2020 11:36 AM GMT
దేశంలోనే ఉత్తమ పోలీసు స్టేషన్లలో జమ్మికుంట పోలీసు స్టేషన్‌

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించిన అత్యుత్తమ పోలీసు స్టేషన్ల జాబితాలో మొదటి పది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పోలీసు స్టేషన్‌ పదో స్థానంలో నిలిచింది. దీంతో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ వ్యాప్తంగా మొత్తం 16 వేలకుపైగా పోలీసుస్టేషన్‌లలో పది పోలీసు స్టేషన్‌లను ఉత్తమ పోలీసు స్టేషన్‌లుగా ప్రతి సంవత్సరం హోంశాఖ ప్రకటిస్తుంది. అయితే గత ఏడాది కూడా ఇదే జిల్లాలో చొప్పదండి పోలీసు స్టేషన్‌కు 8వ స్థానం రావడంతో కరీంనగర్‌ సీపీ కమలహాసన్‌ రెడ్డి జమ్మికుంట పోలీసు సిబ్బందిని అభినందించారు.

తాజాగా జమ్మికుంట పోలీసుస్టేషన్‌ ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపిక కావడం పట్ల రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ జిల్లా పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపిక కావడం తో సీపీ కమలహాసన్‌ రెడ్డి, ఏసీపీ శ్రీనివాసరావు జమ్మికుంట పోలీసు స్టేషన్‌కు వచ్చి సీఐ జృజన్‌రెడ్డి, ఎస్సైలను, పోలీసు సిబ్బందిని ప్రశంసించారు.

కాగా, దేశంలో మొత్తం 16,671 పోలీసు స్టేషన్‌లు ఉండగా, వాటిలో ఉత్తమ పోలీసు స్టేషన్‌ల ఎంపికను కేంద్ర హోంశాఖ చేపట్టింది. ఈ ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ప్రాపర్టీ నేరాలు, మహిళలపై నేరాలు, బలహీనవర్‌గాలపైనేరాలు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు, మృతదేహాలు తదితర కేసులను పరిష్కరించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు స్టేషన్లకు ఈ జాబితాలో చోటు కల్పించారు.

తొలుత 75 పోలీసు స్టేషన్‌ల షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అనంతరం మరో 19 అందులో నుంచి టాప్‌టెన్‌ జాబితాను తయారు చేశారు.ఫైనల్‌లో జాబితాను తయారు చేశారు. వీటిలో పోలీసు స్టేషన్‌లలో మౌలిక సదుపాయాలతో పాటు స్టేషన్‌లోని సిబ్బంది పనితీరుపై వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను కూడా పరిగణలోకి తీసుకుంది కేంద్ర హోంశాఖ. ఈ సర్వేను పూర్తి చేయడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తి సహకారాన్ని అందించినట్లు కేంద్రం పేర్కొంది.

Next Story
Share it