జడ్చర్ల: ఫార్మా, ఐరన్ కంపెనీల వల్ల భూగర్భ జలాల కాలుష్యమే ప్రధాన సమస్య

జడ్చర్లలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సి లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జె.అనిరుధ్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Nov 2023 2:00 PM GMT
jadcherla,  groundwater pollution,  pharma iron companies, poll issue,

జడ్చర్ల: ఫార్మా, ఐరన్ కంపెనీల వల్ల భూగర్భ జలాల కాలుష్యమే ప్రధాన సమస్య

జడ్చర్లలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే సి లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జె.అనిరుధ్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. జడ్చర్లలో మొత్తం 33 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల బలమైన ఉనికిని కలిగి ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ, జన శంకరావమ్ పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ, బహుజన్ ముక్తి పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, భరత చైతన్య యువజన పార్టీ, విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కు మధ్యనే పోరు:

జడ్చర్లలో అసలైన పోరు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యే ఉందని అంటున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకత ఉండడమే కాకుండా.. భూకబ్జా ఆరోపణలు, భూ లావాదేవీలు, ప్రాజెక్టుల్లో కమీషన్లు, అభివృద్ధి లేకపోవడం వంటివి స్థానికుల ప్రధాన ఫిర్యాదులు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జడ్చర్ల నియోజకవర్గంలో ఊహించని పోటీ నెలకొంది. బీజేపీ నుంచి చిత్తరంజన్ దాస్, బీఆర్ఎస్ నుంచి చర్లకోల లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నుంచి జే.అనిరుధ్ రెడ్డి కీలక పోటీదారులుగా ఉన్నారు.

భూమి కాలుష్యం:

జడ్చర్లలోని ఫార్మా కంపెనీల కారణంగా 30 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు, భూమి కలుషితం కావడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో పలు ఐరన్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవి కూడా కాలుష్యానికి కారణం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. కాలుష్య నియంత్రణకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు అమలు కాలేదని, పర్యావరణ పరిరక్షణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలని కోరుతున్నామని జడ్చర్ల రంగారెడ్డి మండలానికి చెందిన జి అశోక్‌ తెలిపారు. పర్యావరణం దెబ్బతింటూ ఉందని.. ఫార్మా, ఐరన్ కంపెనీల ఉనికి కాలుష్యానికి కారణమవుతుందని తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయడంలో సఫలం కాలేకపోతోంది.

ఫార్మా సిటీ, ఇతర వెంచర్ల కారణంగా ఉపాధిని సృష్టించాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు కూడా ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఒక ప్రైవేట్ అంతర్జాతీయ పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. హైవే వెంబడి, ప్రధాన పట్టణంలో జరిగిన అభివృద్ధిని BRS తమ విజయంగా చెబుతూ ఉంది.

భూ వివాదం.. గిరిజనుల ఆవేదన:

ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతూ ఉండగా.. లంబాడా వర్గానికి చెందిన వ్యక్తులే ఎక్కువగా నష్టపోతున్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని వోడెంటాపూర్ రిజర్వాయర్ కోసం 3000 ఎకరాలు తీసుకోవడంపై గిరిజనులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వసతులు కూడా గిరిజనులకు లేకపోవడంతో.. కుటుంబానికి 3 ఎకరాల భూమి, ఇళ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ వైపు గిరిజనులు మొగ్గు చూపుతున్నారు..

ప్రాజెక్టుల కోసం మా భూములు లాక్కున్నారు.. ఇప్పటికీ మాకు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని మాచారం గ్రామానికి చెందిన ఎస్‌ఎస్‌ నాయక్‌ వాపోయారు. భూసేకరణ సమస్యలు, ముఖ్యంగా ఇందిరాగాంధీ మంజూరు చేసినట్లు చెబుతున్న లంబాడా భూములు లాక్కోవడం స్థానిక ప్రజల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. ఈ వివాదాస్పద ప్రాంతాల చుట్టూ రాజకీయ పోరు నడుస్తోంది.

నిరుద్యోగ సమస్యలు:

నిరుద్యోగం గురించిన ఆందోళనలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా యువతకు సరైన ఉపాధి లభించడం లేదు.

ఎన్నికలు ఎలా సాగబోతున్నాయి:

జడ్చర్లలో భూ వివాదాలు, పర్యావరణ సవాళ్లు, నిరుద్యోగం వరకు చాలా సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. డిసెంబరు 3న జరిగే ఎన్నికల ఫలితాలు నియోజకవర్గ భవిష్యత్తును నిర్దేశించే అవకాశం ఉంది.

Next Story