తెలంగాణలో వరదలు.. రూ.100 కోట్ల విరాళం!

వరద బాధితుల కోసం ఒక రోజు బేసిక్‌ పేని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.

By అంజి  Published on  3 Sep 2024 6:42 AM GMT
JAC, Telangana government employees, CMRF, Telangana Floods

తెలంగాణలో వరదలు.. రూ.100 కోట్ల విరాళం!

వరద బాధితుల కోసం ఒక రోజు బేసిక్‌ పేని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఉద్యోగులు, గెజిటెడ్‌ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఒక రోజు బేసిక్‌ పేను సెప్టెంబర్‌ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది. ఈ మొత్తం రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం.

''కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, తుఫాను ప్రభావం వల్ల జనజీవనం స్తంభించడమే కాకుండా ప్రజల ప్రాణాలకు భారీగా హాని కలిగించే రీతిలో పంటల నష్టం, ఆస్తి నష్టం, పశుపక్షాదుల జీవితాలకు తీవ్ర విఘాతం కలిగించిన వరదలతో వేల కోట్ల నష్టాన్ని తెలంగాణ ప్రజలు చవి చూశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడానికి తీర్మానించడం జరిగింది'' అని ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పేర్కొంది.

Next Story