Davos: 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి'.. పారిశ్రామిక వేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ‘గ్రాండ్ ఇండియన్ పెవీలియన్‌’ను కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.

By అంజి
Published on : 21 Jan 2025 1:33 AM

Invest in Telangana, Minister Sridhar Babu, industrialists, Davos

Davos: 'తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి'.. పారిశ్రామిక వేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన ‘గ్రాండ్ ఇండియన్ పెవీలియన్‌’ను కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. దావోస్‌లో తొలి రోజున జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో పాటు కేంద్ర మంత్రులు చిరాగ్‌ పాశ్వాన్‌, జయంత్‌ సింగ్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పీ. రాజీవ్‌, ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు.. పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ రంగానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. 'ఇండియా 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ' లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం 1 ట్రిలియన్ అర్థిక వ్యవస్థగా భాగస్వామ్యం కావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

Next Story