మా గ్రామాన్ని ఆ మండలంలో కలపొద్దు
Inugurthy Village Established as a Mandal. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇనుగుర్తి గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మండలంగా
By Medi Samrat Published on 27 July 2022 2:36 PM ISTమహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇనుగుర్తి గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మండలంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. రాజుల కొత్తపల్లి గ్రామాన్ని ఇనుగుర్తి మండలంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు నిరసన బాట పట్టారు. రాజుల కొత్తపల్లి గ్రామాన్ని ప్రస్తుతమున్న నెల్లికుదురు మండలంలోనే కొనసాగించాలని గ్రామస్తులు అంబేద్కర్ సెంటర్‌లో ధర్నా చేపట్టారు. ఇనుగుర్తి వద్దు-నెల్లికుదురు ముద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిరసనలు ఉదృతం చేస్తామని అంటున్నారు.
మండల కేంద్రంగా ఇనుగుర్తి
ఇదిలావుంటే.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఇనుగుర్తిని మండల కేంద్రంగా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మండలాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి ఉండటంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇనుగుర్తిని మండల కేంద్రంగా ప్రకటించడంపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. ఇక 35 సంవత్సరాలుగా ఇనుగుర్తిని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్న గ్రామస్తుల కోరిక సీఎం నిర్ణయంతో నెరవేరింది.