అప్పుడు నాకు ఇన్విటేషనే పంపలేదు
కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ వ్యవహారంపై
By అంజి Published on 25 May 2023 7:48 PM ISTకొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ వ్యవహారంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్‌ను ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండబోతున్నట్లు పలు విపక్ష పార్టీలు బహిరంగంగా ప్రకటించాయి. మరికొన్ని విపక్ష పార్టీలు ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనే అంశంపై ఇంకా తమ వైఖరి చెప్పాల్సి ఉంది. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని తెలంగాణ సచివాలయం అంశంతో ముడిపెడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
దేశ అత్యున్నత పదవిలో ఉంటున్న రాష్ట్రపతి రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి అని చెప్తున్న తెలంగాణ సీఎంను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలకు చెందిన వ్యక్తులనే గవర్నర్‌గా నియమిస్తున్నారనే ప్రస్తావన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్‌ను సీఎం ప్రారంభించారని, రాష్ట్ర గవర్నర్‌గా తనకు ఆహ్వానం కూడా అందలేదని గుర్తుచేశారు. రాజ్‌భవన్‌కు ఇన్విటేషన్ వెళ్లిందా లేదా అనే అంశంపై రాష్ట్రంలో చాలా తీవ్రస్థాయిలోనే చర్చ జరిగినట్లు గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం అయినందుకు, ఆయన చేతులమీదనే సచివాలయం ప్రారంభం జరిగిందన్నారు. గవర్నర్‌కు ఆహ్వానమే పంపలేదని తమిళిసై వ్యాఖ్యానించారు. ప్రస్తుతం న్యూ పార్లమెంట్ బిల్డింగ్‌ను రాష్ట్రపతి చేతుల మీదుగానే ప్రారంభించాలనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వైఖరిని ప్రస్తావిస్తూ ఇక్కడే తిరకాసు ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా భావిస్తూ గవర్నర్ విషయంలో మాత్రం రాజకీయాలతో ముడిపెడుతూ ఉన్నట్లుగా భావించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.