ఇటీవల కాలంలో తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిర మండలంలోని కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కాలేజీ సిబ్బంది సాయివర్ధన్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి స్నేహితులు తెలిపారు. విద్యార్థి స్వస్థలం ముదిగొండ. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.