1.15 కోట్ల కుటుంబాలకు బీమా.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించారు.

By -  అంజి
Published on : 20 March 2026 1:16 PM IST

Indiramma Kudumba Jeevitha Bima, Telangana Life Insurance Scheme 2026, Bhatti Vikramarka Budget Speech, ₹5 Lakh Family Insurance, Universal Insurance Coverage Telangana, Telangana Budget 2026-27 Highlights

1.15 కోట్ల కుటుంబాలకు బీమా.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి మరియు ధనిక అనే తేడా లేకుండా దాదాపు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా కారణం చేత కుటుంబ యజమాని లేదా సభ్యుడు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ. 4,000 కోట్లు కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2026 జూన్ 2 నుంచి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

సాధారణంగా ప్రభుత్వ బీమా పథకాలు కేవలం బియ్యం కార్డు ఉన్నవారికే వర్తిస్తాయి. కానీ, ఈ పథకాన్ని కుల, మత, వర్గ విభేదాలు లేకుండా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆకస్మిక మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా ఈ రూ. 5 లక్షల నగదు అండగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ బీమాకు సంబంధించి లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. ఈ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలు, నమోదు ప్రక్రియ, క్లెయిమ్ చేసుకునే విధానంపై పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది.

Next Story