ఏ పార్టీలో గెలిచావ్.. ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి హాట్ కామెంట్స్

కరీంనగర్ కలెక్టరేట్‌లో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

By Knakam Karthik  Published on  12 Jan 2025 7:55 PM IST
Karimnagar, congress, brs, mla Kaushik reddy, mla Sanjay kumar

ఏ పార్టీలో గెలిచావ్.. ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి హాట్ కామెంట్స్

కరీంనగర్ కలెక్టరేట్‌లో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశాడు. దీంతో గొడవ మొదలై పరిస్థితి చేదాటిపోయింది.



కౌశిక్‌రెడ్డి, సంజయ్ ఒకరినొకరు తోసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత జరిగింది. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ తరఫున మాట్లాడితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అదే మీటింగ్‌లో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు వారించే ప్రయత్నం చేసినా కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. వివాదం కాస్త మరింత ముదరడంతో రంగం ప్రవేశం చేసిన పోలీసులు కౌశిక్‌రెడ్డిని బయటకు తీసుకెళ్లిపోయారు.

Next Story