కరీంనగర్‌, చైతన్యపురిలో కుక్కుల స్వైరవిహారం.. ఇద్దరు బాలురపై దాడి

In Karimnagar and Chaitanyapuri, two boys were attacked by dogs. హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల ప్రదీప్‌ను వీధికుక్కలు

By అంజి
Published on : 22 Feb 2023 9:58 AM IST

కరీంనగర్‌, చైతన్యపురిలో కుక్కుల స్వైరవిహారం.. ఇద్దరు బాలురపై దాడి

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల ప్రదీప్‌ను వీధికుక్కలు చంపిన ఘటన అందరినీ కలవర పెడుతూండగానే, మరో రెండు వీధి కుక్కల దాడి ఘటనలు హైదరాబాద్‌లోని చైతన్యపురి, కరీంనగర్‌లలో వెలుగుచూశాయి. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నివేదికల ప్రకారం.. హైదరాబాద్‌లోని చైతన్యపురిలో మంగళవారం రిషి అనే బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసి కరిచింది. బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటుండగా అనూహ్యంగా ఈ ఘటన జరిగింది.

తీవ్ర గాయాలపాలైన అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీధికుక్కల దాడిలో అతనికి తీవ్ర గాయాలైనప్పటికీ అతని పరిస్థితి వెంటనే తెలియరాలేదు. ఇదే ఘటనలో కరీంనగర్‌లో ఎస్సీ హాస్టల్ విద్యార్థిపై వీధికుక్కలు దాడి చేశాయి. శంకరపట్నం ఎస్సీ హాస్టల్‌లోకి చొరబడిన వీధి కుక్కలు సుమంత్ అనే విద్యార్థిపై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story