గ్రూప్‌-4 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

గ్రూప్‌-4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు స్పెషల్‌ రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

By అంజి  Published on  5 Sep 2024 1:09 AM GMT
Telangana High Court, Group-4 appointments

గ్రూప్‌-4 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

గ్రూప్‌-4 పోస్టుల నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్‌జెండర్లకు స్పెషల్‌ రిజర్వేషన్ల కల్పనపై 10 రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2022 డిసెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జెశ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వర్సెస్‌ కేంద్రం కేసులో 2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే హైకోర్టు ట్రాన్స్‌జెండర్లకు సమాంతర రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అటు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ కౌంటర్‌ దాఖలుకు 10 రోజుల గడువు కోరారు. కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వానికి ఛాన్స్‌ ఇచ్చింది హైకోర్టు. ఈలోపు చేపట్టే రిక్రూట్‌మెంట్‌ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్వర్తులు ఇచ్చింది.

Next Story