బాసర ట్రిపుల్ ఐటీ ఆత్మహత్యలు.. 48 గంటల్లో రిపోర్టు ఇవ్వండి : తమిళిసై

IIIT Basar Suicides Governor Tamilisai Demands Report Within 48hrs. బాసర ట్రిపుల్ ఐటీలో బాలికల ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేశాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2023 6:58 PM IST
బాసర ట్రిపుల్ ఐటీ ఆత్మహత్యలు.. 48 గంటల్లో రిపోర్టు ఇవ్వండి : తమిళిసై

బాసర ట్రిపుల్ ఐటీలో బాలికల ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటనలపై తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆత్మహత్యలకు దారితీసిన అంతర్లీన సమస్యలను తక్షణమే జోక్యం చేసుకుని పరిష్కరించాలని గవర్నర్ వైస్ ఛాన్సలర్‌ను కోరారు. ఇలాంటి చర్యలను ఎవరూ తీసుకోకండని ఆమె కోరారు. ధైర్యంగా ఉన్నత విద్యను అభ్యసించి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని విద్యార్థులకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న గవర్నర్ భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా యూనివర్సిటీ యంత్రాంగం అమలు చేస్తున్న చర్యలను వివరిస్తూ 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

విషాద మరణాలు :

ఇటీవల లిఖితా గౌడ్, దీపిక అనే ఇద్దరు యువతులు ఆత్మహత్యలకు పాల్పడడంతో ఐఐఐటీ-బాసర క్యాంపస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. లిఖిత అనే 16 ఏళ్ల విద్యార్థిని ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువుతూ ఉంది. ఆమె బాలికల హాస్టల్ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి పడి మృతి చెందింది. 16 ఏళ్ల వయసున్న దీపిక క్యాంపస్‌లోని వాష్‌రూమ్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సూసైడ్ నోట్ కనుగొనలేకపోయారు. ఈ విషాద సంఘటనల వెనుక ఉన్న కారణాల గురించి అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు.

లిఖిత తన మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తూ ఉంది. ప్రమాదవశాత్తు జరిగిన మరణం అని కూడా భావించడానికి వీలు లేదు. ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీపిక ఆత్మహత్య ఆమె చదువులో విఫలమైనందుకేనని అంటున్నారు.

నిపుణుల అభిప్రాయం :

హైదరాబాద్ కు చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ ప్రగ్యా రష్మీ మాట్లాడుతూ.. హృద్రోగ నిపుణులు గుండెపోటును నివారించలేరన్నది ఎంత నిజమో.. మానసిక ఆరోగ్య నిపుణులు మనుషుల సంక్షోభాలను నివారించగలరని ఎలాంటి హామీ ఇవ్వలేమని అన్నారు.

కొన్ని సంస్థలు మానసిక ఆరోగ్య నిపుణులను నియమింకుంటూ ఉంటాయి.. ఇంకొన్ని సంస్థలు పరిమిత బడ్జెట్‌ కారణంగా మానసిక ఆరోగ్య నిపుణులకు దూరంగా కూడా ఉంటాయి మానసిక ఆరోగ్య నిపుణులకు సమర్థవంతమైన సెషన్‌లను నిర్వహించడానికి కావాల్సిన స్వేచ్ఛను సంస్థలు ఇస్తూ ఉండాలి. ఆత్మహత్య వెనుక కేవలం ఒక్క కారణమే ఉంటుందని అనుకోకూడదని ప్రజ్ఞ అన్నారు. ఆత్మహత్య వెనుక ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఒకే కారణాన్ని ఆపాదించడం సాధ్యం కాదు. ప్రతి కేసు ప్రత్యేకమైనది.. విభిన్న వ్యక్తులను.. విభిన్న కారణాలు భిన్నంగా ప్రభావితం చేస్తాయి, ” ఆమె అన్నారు. సమస్యల నుండి బయటపడలేక.. కొందరు ఆత్మహత్యకు పాల్పడితే, మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి సమస్యలను అధిగమిస్తారు. ఇంకొందరు ఇతరుల మద్దతు కోరవచ్చు. కాబట్టి విడిపోవడం, నిరుద్యోగం వంటివి ఆత్మహత్యలకు కారణాలని చెప్పలేమన్నారు.

ఆపద సమయంలో మీకు మద్దతు కావాలంటే, దయచేసి కింది హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించండి: 9152987821, AASRA - 9820466726, రోష్ని ట్రస్ట్ - 040-66202000


Next Story