తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  17 Dec 2023 11:23 AM GMT
ias officers, transferred,  telangana govt,

తెలంగాణలో 11 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు 

తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో పురపాలక ముఖ్యకార్యదర్శిగా దాన కిశోర్‌ను నియమించింది ప్రభుత్వం. అలాగే హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా కూడా అదనపు బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం

పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌ను విపత్తు నిర్వహణశాఖకు బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిసనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్ నియామకం అవ్వగా.. జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డిని నియమించింది ప్రభుత్వం. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినాను నియమించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్‌. శ్రీనివాసరాజుని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా కూడా రాహుల్‌ బొజ్జాకు అదనపు బాధ్యతలను అప్పగించింది. అటవీ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించగా.. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణి ప్రసాద్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవికి బాధ్యతలను అప్పగించారు. నల్లగొండ కలెక్టర్ ఆర్‌.వి.కర్ణన్‌ బదిలీ చేసి.. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌.వి.కర్ణన్‌ను ప్రభుత్వం నియమించింది.


Next Story